Kamal Haasan : ఇండియాను హిందీయాగా మార్చాలని కేంద్రం చూస్తోంది : కమల్ హాసన్

by Muthe.Rajitha |

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు.

Kamal Haasan : ఇండియాను హిందీయాగా మార్చాలని కేంద్రం చూస్తోంది : కమల్ హాసన్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇండియా(INIDA)ను హిందీయాగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు చేశారు. మనం ఇండియా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటే, వారు హిందీయా అని కలలు కంటున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో బలవంతంగా హిందీ రుద్ది, ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. కాగా బుధవారం డీలిమిటేషన్(Delimitation), త్రిభాషా అంశాలపై తమిళపార్టీలు కీలక సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో MNM పార్టీ తరుపున కమల్ పాల్గొని, మాట్లాడారు.

తమిళ ప్రజలు భాష కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన విషయం గుర్తు పెట్టుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. కాగా నేటి తమిళ పార్టీల సమావేశంలో.. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేపట్టాలని, లేదంటే జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జాతీయ విద్యావిధానం(NEP)లో త్రభాషా విధానం అనుసరించకపోతే తమిళనాడుకు కేంద్రం నిధులు విడుదల చేయలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై ఆయా తమిళ పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి పంపాయి.

Next Story