Indigo: రేపు 8 గంటల వరకు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు

by Prasad Jukanti |   (  Updated:2025-12-06 09:45:09  IST  )

ఇండిగో సక్షోభాన్ని మిగతా ఎయిర్ లైన్స్ క్యాష్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

Indigo: రేపు 8 గంటల వరకు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజూ ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo crisis) విమాన సేవలకు అంతరాయం కొనసాగుతోంది. విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో‍వైపు ఈ పరిస్థితిని మిగతా ఎయిర్ లైన్స్ క్యాష్ గా మలుచుకుంటున్నాయి. ఇండిగో సంక్షోభంతో మిగతా ఎయిర్ లైన్స్ తమ టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. సాధారణ టికెట్ ధరల కంటే రెట్టింపు చార్జీల మోత మోగుతున్నాయి. ఈ పరిస్థితిని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. విమాన టికెట్ ధరల పెంపుపై విమానయానశాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ప్రయాణ చార్జీలు క్రమబద్దీకరిచింది. కొత్తగా నిర్ణయించిన చార్జీలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అన్ని విమాన సంస్థలకు విమానయానశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో అవకాశవాదమా అంటూ కేంద్రం మండిపడిన కేంద్రం.. ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్ లైన్స్ కు హెచ్చరించింది. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

రేపు రాత్రి 8 గంటల లోపు రీఫండ్ చేయండి:
ఇండిగో తీరుపై కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఇండిగోకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల రద్దు రీఫండ్ ను ఆలస్యం చేయొద్దని రేపు రాత్రి 8 గంటల లోపు ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికుల సహాయార్ధం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా ఇండిగో విమానాల రద్దుతో పలు రూట్లలో దాదాపు 10 రెట్లు విమాన చార్జీలు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, గోవా, పూణే, శ్రీనగర్ టికెట్లు భారీగా పెరిగాయి.

Next Story