రాష్ట్రానికి కేంద్రం తీపికబురు.. రూ.1500 కోట్ల వరద సాయం ప్రకటించిన ప్రధాని

by Kema Shiva Kumar |

క్లౌడ్ బరస్ట్‌ (Cloud Burst)తో హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో కుండపోతు వర్షాలు కురిశాయి.

రాష్ట్రానికి కేంద్రం తీపికబురు.. రూ.1500 కోట్ల వరద సాయం ప్రకటించిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: క్లౌడ్ బరస్ట్‌ (Cloud Burst)తో హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో కుండపోతు వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇవాళ వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ మేరకు ఆ రాష్ట్రానికి రూ.1,500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంతో పాటు ప్రజలను సాధారణ స్థితికి తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన పనుల చేపట్టాలని ప్రధాని మోడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తదుపరి చర్యల్లో భాగంగా పీఎం ఆవాస్ యోజన (PM Aawas Yojana) ద్వారా దెబ్బతిన్న గృహాల స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారుల పునరుద్ధరణ, పాఠశాలల పునర్నిర్మాణం, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) కింద ఆర్థిక సాయం, పశుసంపద కోసం కిట్లను కూడా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేయబోతున్న నిధులలో రైతాంగానికి కొంత కేటాయించనున్నారు. ఇక వ్యవసాయం చేస్తూ.. ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేని వారికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద దెబ్బతిన్న గృహాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. దీంతో ఖచ్చితమైన నష్టం అంచనా, వేగంగా బాధితులకు సాయం అందించేందుకు తోడ్పడనుంది. భవిష్యత్తులో వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడానికి నీటి సంరక్షణ కోసం రీచార్జ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో విస్తారంగా భూగర్భ జలాలు మెరుగుపడే అవకాశం ఉంది.

Next Story