తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు..

by Disha Web |
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రభుత్వాలకు కేంద్రం శుభవార్త తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భారీగా నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. ఇరు రాష్ట్రాల రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167కేలో 2/4 లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు.

అయితే, ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నై ల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ ఐకానిక్‌ బ్రిడ్జి ఇరు రాష్ట్రాలకు గేట్ వేగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక, రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్‌-భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డు విస్తరణ, ఫుట్‌పాత్‌లకు కూడా ఆమోదం తెలిపారు. లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. అలాగే, ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయని గడ్కరీ తెలిపారు.

READ MORE

Jagan Mohan Reddy కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన నిర్ణయం

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed