జనగనణతో పాటే కులగణన.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనగనణ(Census)తో పాటే కులగణన(Caste Census) చేయాలని నిర్ణయించింది.

జనగనణతో పాటే కులగణన.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనగనణ(Census)తో పాటే కులగణన(Caste Census) చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గెజిట్(Gazette) విడుదల చేసింది. కాగా, దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన జరగబోతోంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన పూర్తి చేయాలని హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్, యాప్‌లలో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

కాగా, ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం, విశ్లేషించడం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయసు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తారు.

Next Story