జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లే!

by Geesa Chandu |
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం..  తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లే!
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ స్థాయిలో.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయుల జాబితా 2024(National Teachers Awards-2024)ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ లోని అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా(Best Teachers) మొత్తం 50 మందిని ఎంపిక చేయగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి తాడూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డి; ఆంధ్రప్రదేశ్ నుంచి కునాటి సురేష్, మిడ్డీ శ్రీనివాస రావు లు ఉన్నారు.

విద్యారంగానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం, ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరిస్తుంది. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 5 వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. అయితే కేంద్రం ఎంపిక చేసిన జాబితా-2024 లో మొత్తం 50 మంది ఎంపికవగా.. అందులో 34 మంది పురుషులు, 16 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వికలాంగ ఉపాధ్యాయులు కాగా, మరొకరు CWSN(Children With Special Needs) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed