నదిలో పడవ బోల్తా.. 34 మందిని కాపాడిన రెస్క్యూ టీం

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-26 09:33:50  IST  )

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. గంగానదిలో 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది.. Latest Telugu News

నదిలో పడవ బోల్తా.. 34 మందిని కాపాడిన రెస్క్యూ టీం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. గంగానదిలో 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. దీంతో నదిలో అందరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 34 మందిని రక్షించారు. అయితే ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటులో ప్రయాణికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Next Story