- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ గాలి తమిళనాడులో కూడా వీస్తోంది.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 సీట్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 సీట్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక విపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఇవాళ తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూర్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన మొదట రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. అనంతరం దక్షిణ భారత ఆర్గానిక్ రైతు సమాఖ్య నిర్వహించిన మూడు రోజుల ఆర్గానిక్ ఫార్మింగ్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతుండగా.. సభకు హాజరైన వారంతా తమ మెడలోని కండువాలను గాల్లోకి ఊపుతూ కేరింతలు కొట్టారు. దీంతో ప్రధాని ‘బిహార్ గాలి తమిళనాడులో కూడా వీస్తోంది’ అని కామెంట్ చేశారు. ముఖ్యంగా యువత వ్యవసాయంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
కోయంబత్తూరు అనేక ప్రత్యేకతలకు నిలయమని.. ఇక్కడ మరుదమలై మురుగన్ ఉన్నారని అన్నారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇక్కడి వారేనని గుర్తు చేశారు. దక్షిణ భారత శక్తి పీఠం కూడా ఇదేనని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయం ఈ శతాబ్దపు అతి ముఖ్య అవసరమని పేర్కొన్నారు. రసాయనాలు మట్టి సారాన్ని నాశనం చేస్తాయని, క్రమంగా వాటిని తగ్గించి పూర్తిగా ఆర్గానిక్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు చిన్న రైతులకు రూ.4 లక్షల కోట్ల వరకు పీఎం-కిసాన్ నిధులు అందాయని, ఆర్గానిక్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.






