- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
37 రోజుల తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా.. అభిజిత్ దీప్కే వీడియో
కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన దీక్ష విరమించిన తరవాత మరో వీడియో విడుదల చేశారు. ఇంట్లో బెడ్ పై నుండి వీడియో రిలీజ్ చేసిన దీప్కే.. ఈ రోజు ఆనందంగా ఉందని , 37 రోజుల తరవాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్నానని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన దీక్ష విరమించిన తరవాత మరో వీడియో విడుదల చేశారు. ఇంట్లో బెడ్ పై నుండి వీడియో రిలీజ్ చేసిన దీప్కే.. ఈ రోజు ఆనందంగా ఉందని , 37 రోజుల తరవాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్నానని అన్నారు. చాలా రోజుల తరవాత రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా నిద్రలేచినట్టు తెలిపారు. 37 రోజులు చాలా కఠినంగా గడిచాయని, అంత సులభంగా లేవని చెప్పారు. తమ పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టైఫాయిడ్ కారణంగా జంతర్ మంతర్ లో అందరినీ కలవలేకపోయానని వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
జంతర్ మంతర్ వద్ద 37 రోజులు ఉన్న ప్రతిఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వారికి దేశంపై ఉన్న ప్రేమకు అభినందిస్తున్నానని చెప్పారు. చాలా మంది విమర్శించినా, ఆరోపణలు చేసినా నిలబడ్డారని వారికి సెల్యూట్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. తనను విమర్శించిన వారందరికీ సైతం థాంక్స్ చెప్పారు. తాము ఎవరినీ విమర్శించనని, విమర్శించడం వల్ల ఏమీ సాధించలేమన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేని పేర్కొన్నారు. భవిష్యత్ లో కాక్రోచ్ జనతా పార్టీ మరింత ముందుకు వెళుతుందని చెప్పారు.






