- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak Army Chief: భారత్ పై మరోసారి తన అక్కసుని వెల్లగక్కిన పాక్
పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కశ్మీర్ అంశం లేవనెత్తుతూ భారత్ పై తన అక్కసుని వెల్లగక్కింది. పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ (Army Chief General Asim Munir) మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కశ్మీర్ అంశం లేవనెత్తుతూ భారత్ పై తన అక్కసుని వెల్లగక్కింది. పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ (Army Chief General Asim Munir) మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. కశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ‘‘ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్థాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా. 1.3 మిలియన్ల భారత సైన్యం, వారి అన్ని సామర్థ్యాలతోనే మమ్మల్ని బెదిరించలేకపోతే.. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ సాయుధ దళాలను అణచివేయగలరని మీరు అనుకుంటున్నారా?’’అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే కశ్మీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం’’ అంటూ చెప్పుకొచ్చారు.
విదేశాల్లోని పాకిస్థానీయులంతా దేశ రాయబారులే..
అంతేకాకుండా పాక్ చరిత్ర గురించి మునీర్ మాట్లాడారు. ‘‘విదేశాల్లోని పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. ఉన్నత భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మీరంతా మర్చిపోకూడదు. మీ పిల్లలకు పాక్ చరిత్ర చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన మతం, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. త్యాగాలు చేశారు. దాన్ని ఎలా రక్షించాలో మాకు తెలుసు. ఈ చరిత్రను భావి తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం ఏంటో తెలుస్తోంది’’ అని మాట్లాడారు. పాక్‌కు బలోచిస్థాన్ గర్వకారణమన్నారు. బలూచిస్థాన్ పాకిస్థాన్‌కు గర్వకారణం. మీరు దానిని అంత తేలికగా తీసుకుంటారా? మీరు పది తరాలు కష్టపడినా కూడా దానిని తీసుకోలేరు. మేం ఈ ఉగ్రవాదులను అతి త్వరలో ఓడిస్తాం. పాకిస్థాన్ భయపడదు" అని బలూచ్ తీవ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు.






