అందుకే దంగల్‌ పాకిస్థాన్‌లో విడుదల కాలేదు.. ఆమిర్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 15:51:38  IST  )

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) మూవీ 2016లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

అందుకే దంగల్‌ పాకిస్థాన్‌లో విడుదల కాలేదు.. ఆమిర్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) మూవీ 2016లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. కానీ, ఆ చిత్రం మాత్రం పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. ఈ క్రమంలోనే ఆమిర్ ఖాన్ ఆ విషయంపై ఓ టీవీ షోలో సంచలన నిజాలను వెల్లడించారు. దంగల్‌ మూవీని డిస్నీ (Disney) నిర్మించిందని తెలిపాడు. పాకిస్తాన్ మూవీ విడదుల చేద్దామని అనుకున్నా అక్కడి సెన్సార్ బోర్డు (Sensor Board) తీవ్రంగా అభ్యతరం చెప్పిందన్నారు. ఆ మూవీలో గీతా ఫొగాట్ మ్యాచ్ గెలిచే దృశ్యంలో ఇండియన్ ఫ్లాగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే జాతీయ గీతాన్ని తొలగిస్తేనే తమ దేశంలో సినిమాను విడుదల చేసేందుకు అనుమతిస్తామని చెప్పిందన్నారు. అయితే, తాను వెంటనే రియాక్ట్ అయి సినీ నిర్మాతలతో పాకిస్తాన్‌లో మూవీ విడుదల కాకపోయినా పర్వాలేదని చెప్పానని అన్నారు. దంగల్‌లో ఇండియన్ ఫ్లాగ్ సీన్ల తొలగింపును ఆలోచించడానికి కూడా ఇష్టపడలేదని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

Next Story