పాక్ విఫలమైన దేశం.. ఆసిమ్ మునీర్ ఒప్పుకున్నాడుగా: రాజ్‌నాథ్ సింగ్

by Phanindra |

పాక్ విఫలమైన దేశం అని, ఆ విషయాన్ని ఆసిమ్ మునీర్ కూడా ఒప్పుకున్నాడంటూ రాజ్‌నాథ్ సింగ్ చురకలేశారు.

పాక్ విఫలమైన దేశం.. ఆసిమ్ మునీర్ ఒప్పుకున్నాడుగా: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చురకలేశారు. భారత్‌ను ఫెరారీతో, పాక్‌ను చెత్తబండితో పోల్చిన మునీర్ వ్యాఖ్యలను గుర్తుచేసిన రాజ్‌నాథ్ సింగ్.. ఇది పాక్ ఫెయిలైందని మునీర్ ఒప్పుకోవడమేనన్నారు. ‘రెండు దేశాలకు ఒకే సమయంలో స్వతంత్రం వచ్చింది. ఒక దేశం కష్టపడి శ్రమించి, బలమైన విధానాలు, ముందుచూపుతో ఫెరారీ వంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది.

మరో దేశం మాత్రం చెత్తబండిలా మిగిలిందంటే.. అది కచ్చితంగా ఆ దేశం వైఫల్యమే. ఆసిము మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ తప్పు ఒప్పుకుంటూ చేసినవే అనుకుంటున్నా’ అని సింగ్ అన్నారు. కొన్నిరోజుల క్రితం యూఎస్‌లోని ఫ్లోరిడాలో పాకిస్తానీయులతో మునీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌ను రాళ్లతో నిండిన చెత్తబండిగా పోల్చారు. ‘భారత్ ఫెరారీ వంటిది. దాన్ని మన చెత్తబండి గుద్దితే ఎవరికి నష్టం?’ అని మునీర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

Next Story