- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నాన్న అందుకే నక్సలైట్‌గా మారారు: మిసిర్ బెస్రా కుమారుడి సంచలన వ్యాఖ్యలు
వ్యవస్థలో అవినీతి వల్లే తన తండ్రి అడవి బాట పట్టారని.. రూ.కోటి రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు నేత మిసిర్ బెస్రా కుమారుడు సిద్ధార్థ్ బెస్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు నాయకులలో ఒకరై, రూ.కోటి రూపాయల రివార్డు కలిగిన మిసిర్ బెస్రా (Misir Besra) కుటుంబ గాథను ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా (Siddharth Besra) ఎట్టకేలకు బయటపెట్టాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ప్రతినిధులు గిరిడీలోని పీర్టాండ్‌లో ఉన్న వారి పూర్వీకుల ఇంటికి వెళ్లినప్పుడు, సిద్ధార్థ్ తన తండ్రి గురించి, తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.
అవినీతి వల్లే అడవి బాట..
మిసిర్ బెస్రా పీజీ (PG) చదివిన విద్యావంతుడని ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా తెలిపారు. ధన్‌బాద్‌లోని పీకే రాయ్ మెమోరియల్ కాలేజీ (P.K. Roy Memorial College)లో చదువుకున్న ఆయనకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ, జాయినింగ్ సమయంలో ఉన్నతాధికారులు రూ.8 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని తెలిపారు. కాళ్ల, వేళ్లా పడినా ఎవరూ అయనను కనికనించలేదని పేర్కొన్నారు. చివరికు భూమి అమ్మయినా లంచం ఇస్తామని కుటుంబ సభ్యులు అన్నప్పటికీ, ‘అర్హత ఉన్నప్పుడు లంచం ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నిస్తూ మిసిర్ బెస్రా ఆ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించారని.. ఆ మనస్తాపంతోనే ఆయన మావోయిస్ట్ పార్టీలో చేరారని సిద్ధార్థ్ బెస్రా తెలిపారు.
చితికిపోయిన కుటుంబం..
సిద్ధార్థ్‌కు ఏడేళ్ల వయసున్నప్పుడే తండ్రి మిసిర్ బెస్రా ఇల్లు వదిలి వెళ్లినట్లుగా గ్రమస్థులు తెలిపారు. ఆ తర్వాత తల్లి కూడా వెళ్లిపోయింది, సోదరి శాంతి (Shanthi) కూడా మరణించినట్లుగా తెలిసింది. తాతయ్య సంరక్షణలో పెరిగిన సిద్ధార్థ్ బెస్రా పదో తరగతి వరకు చదివి, బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఒక పౌడర్ మిల్లులో నెలకు రూ.9 వేల రూపాయల జీతానికి పనిచేస్తున్నారు. ‘గత 28 ఏళ్లుగా నా తండ్రిని చూడలేదు. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు. ఆయన అన్యాయంపై పోరాటం చేసింది చాలు, ఇప్పుడు విశ్రాంతి అవసరం. తుపాకీ వదిలి, పోలీసులకు లొంగిపోయి తిరిగి ఇంటికి రావాలని నేను చేతులు జోడించి వేడుకుంటున్నా’ అని సిద్ధార్థ్ బెస్రా మీడియా మఖంగా తండ్రి మిసిర్ బెస్రాకు విజ్ఞప్తి చేశారు.
లొంగిపోయేందుకు చివరి అవకాశం
తాజాగా, సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (SDG) దీపక్ కుమార్ బాలిబా క్యాంప్‌ను సందర్శించి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలు పంపారు. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈఆర్బీ) ఇన్చార్జి, జార్ఖండ్‌కు చెందిన అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్‍కు నెలరోజుల సమయం ఇస్తున్నామని.. ఈ లోపు అతడు లొంగిపోవాలని లేదంటే ఎన్‍కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. బెస్రాతో పాటు అతని టీమ్‍కు లొంగిపోవడమే వారి ముందున్న ఏకైక మార్గమని దీపక్ కుమార్ క్లియర్ వార్నింగ్ ఇచ్చారు.






