- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ మతతత్వానికి అదే నిదర్శనం: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లోని సిక్కు ఐపీఎస్ అధికారిని ఖలిస్థానీ పేరుతో దూషించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ మతతత్వానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని సిక్కు ఐపీఎస్ అధికారిని ఖలిస్థానీ పేరుతో దూషించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ మతతత్వానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలోని బంకురాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమత ప్రసంగించారు. తలపాగా ధరించిన ఐపీఎస్ ఆఫీసర్‌ను ఖలిస్థానీగా పేర్కొనడం సరికాదని తెలిపారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. ‘బెంగాల్‌ను అభివృద్ధి చేయలేదని, బీజేపీ చెప్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మాత్రం వారు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తెలిపారు. కాగా, నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వివాదాస్పదమైన సందేశ్‌ఖాలీని సందర్శించకుండా రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారిని అడ్డుకున్నందుకు గాను ఓ సిక్కు ఐపీఎస్ ఆఫీసర్‌ను బీజేపీ ఖలిస్థానీగా అభివర్ణించింది. దీంతో ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయగా..స్పందిచన బీజేపీ అటువంటి ఆరోపణలు చేయలేదని కొట్టిపారేసింది.
నిరసనలకు హైకోర్టు పర్మిషన్
సందేశ్‌ఖాలీ ఘటనపై కోల్‌కతా మైదాన్‌లో నిరసన ప్రదర్శన చేసేందుకు కలకత్తా హైకోర్టు బీజేపీకి పలు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 28, 29 తేదీల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపొచ్చని వెల్లడించింది. అయితే ఆందోళన టైంలో 150 మందికి మించి ఉండకూడదని, లౌడ్ స్పీకర్లను ఉపయోగించొద్దని ఆదేశించింది. సందేశ్‌ఖాలీలో లైంగిక వేధింపులు, భూకబ్జా కేసులకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి టీఎంసీ ప్రభుత్వం అనుమతించడం లేదని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించగా అనుమతిచ్చింది.






