INDIA : అది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 12:25:24  IST  )

భారత్ INDIAలో సార్వత్రిక ఎన్నికల(Elections)లో ఎవరినో గెలిపించడానికి రూ.182కోట్ల నిధులను జో బైడెన్(Joe Biden) ప్రభుత్వం కేటాయించిందన్న అమెరికా(USA) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(President Donald Trump)చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి.

INDIA : అది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ INDIAలో సార్వత్రిక ఎన్నికల(Elections)లో ఎవరినో గెలిపించడానికి రూ.182కోట్ల నిధులను జో బైడెన్(Joe Biden) ప్రభుత్వం కేటాయించిందన్న అమెరికా(USA) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(President Donald Trump)చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రంప్ వెల్లడించిన అంశాలు కలవరపెడుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పందించింది. భారత్ లో “యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్”(USAID)నిధులపై అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన అంశాలు భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం మాదిరిగానే కనిపిస్తోందని ఎంఈఏ అభిప్రాయపడింది.

ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు, సంస్థలు దృష్టి సారించాయని వెల్లడించింది. భారత ఎన్నికల ప్రక్రియలో గత జో బైడెన్ యంత్రాంగం జోక్యం చేసుకోవడమే కాకుండా భారీగా నిధులు ఖర్చు చేసినట్లుగా ట్రంప్ సొంతింటి గుట్టును బయటపెట్టడం ఇరుదేశాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ గతంలో అనుమానించినట్లుగానే ట్రంప్ ఆరోపణలు చేయడంతో కేంద్రం సీరియస్ గా దీనిపై ఫోకస్ పెట్టింది.

పదేళ్లుగా భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థికంగా, సైనికంగా శక్తిని పెంపొందించుకోవడం నచ్చని జో బైడెన్ సర్కారు.. భారత్‌లో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటల సారంశంగా ఆ పార్టీ నాయకత్వం గుర్తిస్తుంది.

తమకు నచ్చిన దేశాలకు వివిధ రూపాల్లో సహాయం అందించడం కోసం ఉద్దేశించిన “యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్” (USAID) నిధులను తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేందుకు ఉపయోగించారన్నది ట్రంప్ ప్రకటన సారాంశంగా కేంద్రం అంచనా వేస్తుంది. భారత్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం పెంచడం కోసం అంటూ ఏకంగా 21 మిలియన్ డాలర్ల యూఎస్ఏఐడీ నిధులను భారత్‌లోని బీజేపీ – మోదీ వ్యతిరేక శక్తులకు అందజేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను అన్ని కోణాల్లో బీజేపీ విశ్లేషిస్తుంది.

భారత్‌లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు ప్రచారానికి ఈ నిధులు వినియోగించారని...ఈ మొత్తం కుట్రలో కీలక పాత్ర పోషించింది తెలుగు మహిళయైన యూఎస్ఏఐడీ ఇండియా చీఫ్‌గా పనిచేసిన వీణా రెడ్డిగా అనుమానిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఈ వ్యవహారంలో వీణా రెడ్డి ప్రమేయం ఏమిటన్నది కూడా తేలుతుందంటున్నారు.

Next Story