ఆఫ్ రోడ్ అడ్వెంచర్... నదిలో మునిగిన థార్

by Muthe.Rajitha |

మహీంద్రా థార్ వాహనానికి మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆఫ్ రోడ్ అడ్వెంచర్... నదిలో మునిగిన థార్
X

దిశ, వెబ్ డెస్క్ : మహీంద్రా థార్ వాహనానికి మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థార్ నడపడం స్టేటస్ సింబల్ గాను, లగ్జరీగానే కాదు.. థార్ తో స్టంట్లు కూడా వేస్తుంటారు యువత. అయితే ఇటీవల ఓ థార్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ కాస్త విషాదంగా ముగిసింది. ఢిల్లీలో ఆదివారం వీకెండ్ ఆఫ్‌రోడింగ్ అడ్వెంచర్‌కు ఓ థార్ లవర్స్ గ్రూప్.. గురుగ్రామ్-ఫరీదాబాద్ సమీపంలోని ఆరావళికి బయల్దేరారు. మధ్యలో ఓ నది నుంచి థార్ వాహనాలను నడిపే ప్రయత్నం చేస్తుండగా.. ఓ కారు నీటిలో చిక్కుకుపోయి, మునిగిపోయింది.

లక్కీగా లోపల ఉన్న వ్యక్తి క్షణాల్లోనే అందులో నుంచి బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం మరో థార్ సాయంతో కారును బయటకు లాగే ప్రయత్నం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు.

Next Story