- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌత్‌లో మరో స్టేట్‌పై కన్నేసిన CM విజయ్.. జెండా పాతాలని గట్టి ప్రయత్నం!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన సరికొత్త రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK - 'టీవీకే) విస్తరణలో భాగంగా ఆయన కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, త్వరలో జరగబోయే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (BBMP) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కర్ణాటకలో పార్టీ జెండా పాతాలని విజయ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బెంగళూరుపైనే ఎందుకు చూపు..?
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో స్థానిక కన్నడిగులతో పాటు లక్షలాది మంది తమిళ ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు. అంతేకాకుండా, నటుడిగా విజయ్‌కు కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు, బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయాన్ని బెంగళూరులోని విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుని తమ మద్దతును చాటుకున్నారు. ఈ సానుకూలతలను ఓట్లుగా మార్చుకుని, అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని టీవీకే అధిష్ఠానం భావిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బెంగళూరు రాజకీయ వర్గాల్లో ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ.. దీనిపై తమిళనాడు సీఎం విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీని జాతీయ స్థాయికి లేదా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ ముందడుగు ఉండబోతోందని, త్వరలోనే బెంగళూరు ఎన్నికల పోటీపై టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.






