‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం’: రివీల్ చేసిన దళపతి విజయ్

by Gantepaka Srikanth |

టీవీకే పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం చెన్నైలోని వెల్లూరులో విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం’: రివీల్ చేసిన దళపతి విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీకే పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం చెన్నైలోని వెల్లూరులో విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టాలిన్‌ది సూపర్ స్టార్ పాలన కాదు.. స్టాండప్ కమెడియన్ పాలన తీవ్రంగా విమర్శించారు. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగబోతోంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే పోటీ ఉండబోతోందని జోస్యం చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా.. అద్భుతంగా టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

విజయ్ పోటీ చేసే నియోజకవర్గమిదే!

మరోవైపు.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా దళపతి విజయ్ తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు అధికారాన్ని కాపాడుకునే పనిలో డీఎంకే పార్టీ శ్రమిస్తోంది. ఇక అన్నాడీఎంకే- బీజేపీ కూటమి సైతం ఈసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story