- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్.. పడిగాపులు కాసిన అభిమానులు
దళపతి విజయ్(Thalapathy Vijay) కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 40 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్(Thalapathy Vijay) కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 40 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని మోడీ(PM Modi), తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ దిగ్భ్రాంతి గురయ్యారు. ఇదిలా ఉంటే.. విజయ్ కేవలం పదివేల మందితో నిర్వహిస్తామని పర్మిషన్ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. 50 వేల మంది రావడంతో అదుపు చేయలేకపోయామని పేర్కొన్నారు. నిర్వహకుల వైఫల్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. మరోవైపు విజయ్ ఈ సభకు ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారని.. ఆయన కోసం అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు గంటలతరబడి పడిగాపులు కాసి నీరసించి పోయాయని సమాచారం. తక్షణ సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి, కలెక్టర్‌కు సూచించారు.






