- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ ఆపేసిన కాలేజీలోనే గెలుపు సర్టిఫికెట్ అందుకున్న దళపతి
తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఏకంగా 96 స్థానాల్లో విజయం సాధించగా మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఏకంగా 96 స్థానాల్లో విజయం సాధించగా మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. గత కొన్నేళ్లుగా తమిళ రాజకీయాల్లో రాణిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టేసింది. టీవీకే అధినేత విజయ్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లోనూ విజయం సాధించాడు. కాగా పెరంబూర్ నియోజకవర్గంలో గెలిచిన సందర్భంగా సంబంధిత సర్టిఫికెట్ నుండి ఆర్ వో నుండి విజయ్ అందుకున్నారు. చైన్నై లోని లయోలా కాలేజీలో విజయ్ ఎమ్మెల్యేగా గెలిచినట్టు ధ్రువపత్రం అందుకున్నారు. అయితే విజయ్ ఇదే కాలేజీలో డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చదువుతో జీవితంలో ఏదైనా సాధించడానికి సంబంధంలేదని విజయ్ డిగ్రీ ఆపేసిన చోటే ఎమ్మెల్యేగా దక్కించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.






