- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాయిలాండ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
థాయిలాండ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: థాయిల్యాండ్‌తో కాల్పుల విరమణకు కంబోడియా అంగీకరించింది. కొన్ని వారాలుగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాకెట్, ఆర్టిలరీ దాడులు.. ఫైటర్ జెట్ సార్టీలతో వేడెక్కిన ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం తెచ్చేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఇరుదేశాల రక్షణ మంత్రులు స్వయంగా ఈ ప్రకటన చేశారు. ‘ఇరుదేశాలు భద్రతా దళాలను ముందుకు కదిలించకుండా.. ఎక్కడ ఉన్న సైన్యాన్ని అక్కడే ఉంచేందుకు అంగీకరించాయి’ అని రెండు దేశాల రక్షణ మంత్రులు జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
‘ఇలాంటి సమయంలో సైన్యానికి రీఇన్‌ఫోర్స్‌మెంట్ మోహరించడం పరిస్థితిపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు దీర్ఘకాల నష్టం జరుగుతుంది’ అని కంబోడియా రక్షణ శాఖ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై థాయిల్యాండ్ రక్షణ మంత్రి నథఫోన్ నక్రఫానిట్, కంబోడియా డిఫెన్స్ మినిస్టర్ టీ సీహా సంతకాలు చేశారు. దీంతో సుమారు 20 రోజులుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవకు ముగింపు పలికినట్లయింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 101 మంది మరణించగా.. ఇరుదేశాల్లో కలిపి సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అంచనా.






