- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గామ్ ఉగ్రదాడికి ముందు 4చోట్ల రెక్కీ..వెలుగులోకి కొత్త విషయాలు
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 15వ తేదీన ఉగ్రవాదులు పహల్గామ్ చేరుకున్నట్టు దర్యాప్తు అధికారులు గర్తించారు. ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులకు సహకరించిన దాదాపు 20 మందిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఒకరు పలు విషయాలను అధికారులకు వెల్లడించారు. 15వ తేదీన ఉగ్రవాదులో పహల్గామ్ చేరుకోగా పక్కా ప్రణాళిక రచించుకున్నారు. నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది.
బైసరన్ వ్యాలీతో పాటూ అరు వ్యాలీ, బేతాల్ వ్యాలీ, అమ్యూస్‌మెంట్ పార్క్‌లలో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారట. ఈ ప్రాంతాల్లో భద్రత ఎక్కువ ఉండటంతో ప్లాన్ ప్రకారం పహల్గామ్‌లో దాడికి తెగబడినట్టు దర్యాప్తులో తేలింది. అంతే కాకుండా ఉగ్రవాదులకు సహకరించిన కొందరు స్థానికులు కీలక పాత్ర పోశించినట్టు దర్యాప్తు బృంధాలు చెబుతున్నాయి. వీరే ఉగ్రవాదులకు అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటూ ప్రయాణ ఏర్పాట్లు చేసినట్టు గుర్తించాయి. ఉగ్రదాడికి ముందు పహల్గామ్ లో రెండు శాటిలైట్ ఫోన్లు వాడినట్టు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉండగా కేంద్రం మాత్రం ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లే అని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.






