- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bahawalpur: కసబ్ ను తయారు చేసిన మదర్సా ఒక్క మిసైల్ తో బూడిద...ఉగ్రవాద కార్ఖానా బహవల్పూర్ నేలమట్టం..
Bahawalpur: 2008 ముంబై దాడి అనగానే గుర్తొచ్చే పేరు మానవ మృగం కసబ్.. ఈ కనికరం లేని తీవ్రవాదిని తయారు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: Bahawalpur: 2008 ముంబై దాడి అనగానే గుర్తొచ్చే పేరు మానవ మృగం కసబ్.. ఈ కనికరం లేని తీవ్రవాదిని తయారు చేసింది. పాకిస్థాన్లోని బహవల్పూర్ లోని ఉగ్రవాద శిబిరంలోనే శిక్షణ పొందాడు. బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా నేలమట్టమయింది. ఇక్కడే వందలాదిమంది ఉగ్రవాదులు హతమవడంతోపాటు, తీవ్రంగా గాయాల పాలైనట్లు సమాచారం అందుతుంది.
ఈ బహవల్పూర్ లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మసూద్ అజహర్ నివాసం ఉంటాడు. ఆయన కుటుంబం కూడా ఇక్కడే నివసిస్తుంది. ఈ పట్టణంలో మొత్తం నాలుగు ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇస్లామిక్ స్టడీ సెంటర్లు గాను, మసీదులుగాను, గ్రంథాలయాలుగాను బయటనుంచి కనిపిస్తుంటాయి. వీటన్నింటికీ కొన్ని ట్రస్టులు ఆర్థిక సహాయం అందిస్తుంటాయి.
ఈ ట్రస్టులు అన్నీ కూడా పాకిస్థాన్ మిలిటరీ కనుసన్నల్లో నడుస్తుంటాయి. ఈ ట్రస్టుల ద్వారానే ఈ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక్కడి నుంచే 2001 సంవత్సరంలో జరిగిన భారత పార్లమెంటు పై దాడి సహా 2007లో జరిగిన ముంబై పై దాడి, అలాగే పుల్వామా ఘటన వరకు అన్నీ కూడా బహవల్పూర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల ద్వారానే జరిగినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు బహవల్పూర్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.
ముంబై పైన దాడి చేసి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న సయ్యద్ అజ్మల్ కసబ్ సైతం ఈ బహవల్పూర్ నుంచే శిక్షణ పొందాడని తెలుస్తోంది. ఇక్కడ మైనర్ బాలురని తీసుకొని వచ్చి వారికి చిన్నతనం నుంచే మతఛాందసవాదాన్ని నూరిపోస్తారు. ఆ తర్వాత వారికి టెర్రరిస్ట్ శిక్షణ అందించి బార్డర్ దాటించి భారత్ లోకి వదులుతారు. జైషే మహ్మద్ అగ్రనేత మసూద్ అజహర్ పుట్టిన ఊరు కూడా బహవల్పూర్ కావడం యాదృఛ్చికం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం బహవల్పూర్ పై జరిగిన దాడి పాకిస్తాన్ ఉగ్రమూకలపై జరిగిన దాడి ద్వారా ఉగ్రవాదుల వెన్నును విరిచినట్లు అయిందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయినట్లయితే, మరింత మంది ఉగ్రవాద నేతలు హతమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ దాడి నేపథ్యంలో ఇప్పటికే కీలక ఉగ్రవాద నేతలంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.






