- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jammu and Kashmir : జమ్ములో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాది హతం
by Phanindra |
జమ్ముకశ్మీర్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

X
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుప్వారాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ముష్కరుడిని అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. 'కుప్వారా పోలీసులు అందిన సమాచారం ఆధారంగా సైద్ పోరా ఫార్వర్డ్ ఏరియాలో చొరబాటును సైన్యం అడ్డుకుంది. ఆర్మీతో కలసి పోలీసులు ఉగ్రవాదిని మట్టుబెట్టారు' అని కశ్మీర్ జోన్ పోలీస్ ట్వీట్ చేసింది. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
Next Story






