Terrorist: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.ని కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Terrorist: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.ని కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నిఘా సమాచారం ఆధారంగా.. ఏప్రిల్ 9న కిష్త్వార్‌లోని ఛత్రు అటవీ ప్రాంతంలో జమ్ముకశఅమీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సెర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. అదేరోజు సాయంత్రం ఉగ్రజాడలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భద్రతాబలగాలు కాల్పులు జరిపిన వెంటనే ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఇప్పటివరకు ఒకర్ని చంపినట్లు జమ్ముకు చెందిన వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. " ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, మన ధైర్య సైనికుల నిరంతర ఆపరేషన్లు కొనసాగుతున్నాయి" అని అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా, మంచుతో కప్పబడిన దట్టమైన అడవి గుండా ఇరుకైన మార్గంలో సైనికులు నడుస్తున్నట్లు చూపించే రెండు ఫొటోలను జతచేసింది.

ఏడాది కాలంగా..

ఇకపోతే, గత నెలలో సరిహద్దులు దాటి కథువా జిల్లాలోకి చొరబడిన ఉగ్రవాదులపై భారీ ఆపరేషన్ ప్రారంభించారు. మార్చి 28న జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు మరణించారు. కథువాలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. గత ఏడాది కాలంగా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు.. ఉదంపూర్, దోడా, కిష్త్వార్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలకు చేరుకునేందుకు కథువా ప్రధాన చొరబాటు మార్గంగా మారింది. దీంతో, భద్రతాబలగాలు అక్కడ గస్తీని పెంచాయి.

Next Story