- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Terrorist: పరారీలో ఉన్న హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు ప్లాన్ !
రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఆయనను ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ అలియాస్ హుస్సేన్ మాలిక్‌గా గుర్తించింది. పక్కా సమాచారం మేరకు యూపీలోని మొరాదాబాద్‌లో పట్టుకున్నారు. యూపీలో ఆయన ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారని విచారణలో తేలింది. ఆయన యూపీకి రాకముందు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో శిక్షణ పొందినట్టు ఏటీఎస్ తెలిపింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని పూంచ్ జిల్లాలోని ఫజలాబాద్ గ్రామానికి చెందిన హుస్సేన్‌ను పలు ఉగ్ర కుట్ర ఆరోపణలతో మొదటి సారి 2002 జూలై 9న అరెస్ట్ చేశారు. ఆ టైంలో భద్రతా బలగాలు ఆయన వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై పోటా చట్టం సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు 2007లో బెయిల్ మంజూరు కాగా అప్పటి నుంచి బయటకు వచ్చిన ఆయన కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. దీంతో శనివారం ఆయన ఏటీఎస్‌కు పట్టుబడ్డాడు. మొరాబాబాద్ లోని ఓ కోర్టు హుస్సేన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. స్థానిక పోలీసులు సైతం ఆయనపై రూ.25000 రివార్డు ప్రకటించారు.






