ముంబై, బెంగళూరులో ఉగ్రకదలికలు!

by samatah |

ముంబై, బెంగళూరులో ఉగ్రకదలికలు కలకలం రేపాయి. ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా వంటి ఉగ్రసంస్థల జాడలు ఉన్నాయనే నెపంతో

ముంబై, బెంగళూరులో ఉగ్రకదలికలు!
X

న్యూఢిల్లీ: ముంబై, బెంగళూరులో ఉగ్రకదలికలు కలకలం రేపాయి. ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా వంటి ఉగ్రసంస్థల జాడలు ఉన్నాయనే నెపంతో పలు ప్రాంతాల్లో జాతీయ పరిశోధన సంస్థ(ఎన్ఐఏ) శనివారం సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిషేధిత ఐఎస్ ఉగ్ర సంస్థ కార్యాకలపాలను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపిస్తూ సోదాలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఈ తనిఖీల్లో పలు ఇళ్లలో డిజిటల్ పరికరాలు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. గత నెలలో కర్ణాటకలో ఆరు ప్రాంతాల్లో చేసిన సోదాల్లో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.


Next Story