- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడిలో దారుణం.. పెళ్లైన ఆరు రోజులకే మృత్యు ఒడికి నేవీ అధికారి
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో చనిపోయిన 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Navy Officer Vinay Narwal) కు ఇటీవలే వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ముష్కరుల దాడిలో మరణించడం అందరినీ కదిలించింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయిన వినయ్ నర్వాల్ కొచ్చి (Kochi)లో నేవీ లెఫ్టినెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఏప్రిల్ 16న అతని వివాహం జరగగా.. ఈ నెల 19 న జరిగిన వివాహ రిసెప్షన్ తో పెళ్లి వేడుకలు ముగిశాయి. అనంతరం చిన్న ట్రిప్ కోసం పహల్గామ్ వెళ్లాడు. పెళ్లైన ఆరు రోజులకే ఉగ్రదాడి రూపంలో మృత్యువు కబలించడంతో ఆ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. కాగా పహల్గామ్ లోని బైసనర్ లో ట్రెక్కింగ్ కు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు పైశాచికంగా దాడులు జరిపారు. ఐడీలు చెక్ చేసి, పేర్లు అడిగి మరీ ఓ వర్గమే టార్గెట్ గా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఉగ్రదాడిలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.






