అల్‌ఫలాహ్ వర్సిటీ కేంద్రంగా టెర్రర్ ప్లాన్.. బాంబుల తయారీ అక్కడే

by Kema Shiva Kumar |

ఢిల్లీ బాంబ్ బ్లాస్ కేసు (Delhi Bomb Blast Case) విచారణలో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

అల్‌ఫలాహ్ వర్సిటీ కేంద్రంగా టెర్రర్ ప్లాన్.. బాంబుల తయారీ అక్కడే
X

దిశ, వె‌బ్‌డెస్క్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ కేసు (Delhi Bomb Blast Case) విచారణలో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా, మరో విషయం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే, ఉగ్ర కుట్ర నిందితులు ఫరీదాబాద్‌లోని అల్‌ఫలాహ్ యూనివర్సిటీ (Alfalah University) కేంద్రంగానే టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినట్లుగా ఇన్వేస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి. క్యాంపస్ పరిధిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఐఈడీ (IED) బాంబులు తయారు చేసినట్లుగా సమాచారం. వర్సిటీ‌లోని రూమ్ నెంబర్.13లో పేలుడుకు అవసరమైన సామగ్రితో బాంబులు తయారు చేశానట్లు దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, బాంబ్ బ్లాస్ట్ కోసం డాక్టర్ ఉమర్, షహీన్, ఆదిల్‌ కలిసి రూ.26 లక్షలు సమీకరించినట్లుగా విచారణలో వెల్లడైంది. రూ.3 లక్షలతో గురుగ్రామ్, నూహ్ ప్రాంతం నుంచి 20 క్విటాళ్ల NPK ఎరువులు కొనుగోలు చేశారని.. ఆ ఎరువుతో అమ్మోనియం నైట్రేట్ (Ammonium Nitrate) ఆధారిత ఐఈడీ బాంబులు తయారీ చేశారని తెలుస్తోంది. సిగ్నల్ యాప్ (Signal App) ద్వారా డాక్టర్ ఉమర్ నలుగురు సభ్యులతో గ్రూప్‌ను తయారి చేసినట్లుగా వెల్లడైంది. అయితే, బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 6 నుంచి 7 ప్రాంతాల్లో రీవేంజ్ అటాక్స్‌కు ముష్కరులు ప్లాన్ చేశారని అధికారులు వెల్లడించారు. మొత్తం ఐదు ఫేజ్‌లుగా టెర్రర్ ప్లాన్ చేశారని అందులో మొదటగా టెర్రల్ మాడ్యూల్ ఏర్పరచడం, భారీగా బ్లాస్ట్ మెటీరియల్‌ను సేకరించడం, ఐఈడీని తయారు చేయడం, నిర్ధారించిన లొకేషన్లలోకి ఐఈడీ బాంబులను చేరవేయడం, కొ-ఆర్డినేషన్‌తో వరుస పేలుళ్లకు పాల్పడటమే లక్ష్యంగా ఆ నలుగురు పక్కాగా ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.

Next Story