నేపాల్‌లో ఉద్రిక్తతలు.. యూపీలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

by Malleboina Mahesh |

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తం అయ్యారు.

నేపాల్‌లో ఉద్రిక్తతలు.. యూపీలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ (Nepal) దేశంలో అంతులేని అవినీతి ఆరోపణలు, సోషల్ మీడియా బ్యాన్ తో చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనలతో దిగొచ్చిన ప్రధాని, అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికి నిరసనలు ఆగడం లేదు. జెన్ Z పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ఇళ్లే లక్ష్యంగా నిరసనకారులు దాడులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నేపాల్ దేశం అంతటా ఆందోళనకరమైన వాతావరణ నెలకొంది. భారత్ కు పొరుగు దేశమైన నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP Chief Minister Yogi Adityanath) అప్రమత్తం అయ్యారు. ఆయన సూచనల మేరకు ఉత్తర ప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాల ప్రకారం, నేపాల్ సరిహద్దు కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో పోలీసులు 24 గంటలపాటు హై అలర్ట్‌ (High alert)లో ఉండనున్నారు. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించి, పెట్రోలింగ్, నిఘా చర్యలను పెంచారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన పక్షంలో వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యూపీ ప్రభుత్వం (UP Govt) ప్రకటించింది.

Next Story