- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ హై కమిషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. అసలు విషయం ఇదే!
పహల్గాం ఉగ్రవాదుల దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం (Pahalgam) ఉగ్రవాదుల దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ఈ నేపథ్యంలోని దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం (Office of the High Commission of Pakistan) ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ కుఠిల బుద్ధికి నిరసనగా పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలతో పాటు నగరవాసులు పాక్ హై కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భారత్‌లోకి ఇకపై పాకిస్తానీయులకు నోఎంట్రీ అంటూ నినాదాలు చేశారు. పాక్ నుంచి వచ్చిన పర్యాటకులు, పౌరులు 48 గంటల్లో భారత్ వీడాలంటూ ‘ఖాళీ కరో.. ఖాళీ కరో’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
మరికొద్దిసేపట్లో అఖిలపక్షం భేటీ..
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాసేపట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షత వహించనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress)తో పాటు సహా ఇతర రాజకీయ పక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పహల్గాం ఉగ్రదాడిపై భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. బార్డర్‌లో ఉగ్ర కార్యకలాపాలను స్వస్థి పలికే వరకు దాయాది పాక్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సింధూ నదీ (Indus River) జలాల ఒప్పందం అమలును తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ దేశ సైనిక సిబ్బందితో పాటు ఇతర అధికారులను మరో వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఇవాళ ఉదయం భారత విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది.






