అసోంలో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

by Muthe.Rajitha |

అసోంలోని గోల్పారా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అసోంలో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : అసోంలోని గోల్పారా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గోల్పారా జిల్లాలో ప్రభుత్వ భూమి ఆక్రమణలను తొలగించే క్రమంలో ప్రభుత్వ అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులు, అధికారులపై రాళ్లు విసరగా... ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇన్ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. అయితే స్థానికుల దాడుల్లో పోలీసులు, అధికారులు కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story