Supreme Court: దేవాలయాల సంపద దేవుడిదే... గుడి డబ్బు బ్యాంకులు వాడుకోవడంమేంటి? : సుప్రీంకోర్టు

by Prasad Jukanti |   (  Updated:2025-12-05 11:45:02  IST  )

గుడి డబ్బును బ్యాంకుల కోసం వాడరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court: దేవాలయాల సంపద దేవుడిదే... గుడి డబ్బు బ్యాంకులు వాడుకోవడంమేంటి? :  సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవాలయాల ఆస్తులు, సంపద దేవుడిదేనని శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. గుడి డబ్బును బ్యాంకుల మనుగడ కోసం వినియోగిచండం ఏమిటని ప్రశ్నించింది. దేవాలయానికి చెందిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న తిరునెల్లి ఆలయానికి (Thirunelly Temple Devaswom) డబ్బులను ఆలయ ట్రస్ట్ స్థానిక సహకార బ్యాంకులలో (cooperative banks) ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది. 2025 ప్రారంభంలో చెల్లించాల్సిన డిపాజిట్లను ఇవ్వాలని ఆలయ ట్రస్ట్ పదే పదే సహకార బ్యాంకులకు విజ్ఞప్తి చేసినా వాటిని బ్యాంకులు నిరాకరిస్తూ వచ్చాయి. ఆలయ కార్యకలాపాలు, నిర్వహణకు నిధుల కొరత ఉందని అందువల్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను రద్దు చేసి వెంటనే ఆ సొమ్ము చెల్లించాలని ఆలయ ట్రస్ట్ కోరుతూ వస్తోంది. అయినా బ్యాంకులు మాత్రం ఆ డబ్బును ఇవ్వడం లేదు. దీంతో సహకార బ్యాంకుల మొండితీరుపై ఆలయ ట్రస్ట్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ జరిపిన న్యాయస్థానం రికార్డులను పరిశీలించిన తర్వాత ఎటువంటి సరైన కారణం లేకుండానే బ్యాంకులు ఆలయ ట్రస్ట్ డిపాజిట్లను నిలిపివేస్తున్నాయని గుర్తించింది. దీంతో రెండు నెలల్లోపు మొత్తం డిపాజిట్లను తిరునెల్లి దేవాలయం ట్రస్ట్ కు చెల్లించాలని ఆదేశించింది.

సుప్రీంకు వెళ్లిన బ్యాంకులు:

కేరళ హైకోర్టు (Kerala High Court) ఇచ్చిన తీర్పుపై సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant), జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో (Justice Joymalya Bagchi) కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన ధర్మాసనం.. సహకార బ్యాంకుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆలయాల సంపద దేవుడికే చెందుతుందని సహకార బ్యాంకులను కాపాడటానికి గుడి డబ్బును ఉపయోగిస్తారా? గుడి డబ్బులు బ్యాంకులకు ఆదాయ మార్గం కాకూడదని సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టుకోలేకపోవడం అనేది సహకార బ్యాంకుల సమస్య అనిద అందుుక దేవుడి సొమ్మును వాడటం సరికాదంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ప్రజల నమ్మకాన్ని పొందండంలో బ్యాంకులు విఫలం అయితే అది వాటి సమస్య అని బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బ్యాంకులు దేవాలయ డిపాజిట్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందడంలో బ్యాంకులు విఫలం అయితే అది ఆ బ్యాంకుల సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Next Story