- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ (Niti Aayog) 10వ పాలకమండలి సమావేశానికి తెలుగురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ (Niti Aayog) 10వ పాలకమండలి సమావేశానికి తెలుగురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో (Bharat Mandapam) జరగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ (Rising 2047 Vision)ను ఆవిష్కరించనున్నారు. 2018 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి హాజరవుతున్న నీతి ఆయోగ్ సమావేశమిది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు.
ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్(Vision Document)ను విడుదల చేశారు. అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదల, నదుల అనుసంధానం, నీటి వినియోగంపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఒక్కోసీఎంకు 7 నిమిషాల సమయం కేటాయించగా.. ఆ సమయంలో సీఎం చంద్రబాబు ఈ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కాగా.. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రాల పాత్ర, చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటల వరకు నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి పై తమ తమ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు ప్రధానికి వివరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసమివ్వనున్నారు.






