- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చికాగోలో మంగళవారం ఓ యువతి వాకింగ్ చేస్తుండగా ట్రక్ ఢీకొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చికాగోలో (Chicago) ఆదివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణకు (Telangana) చెందిన ఓ విద్యార్థిని మృతిచెందింది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీజ వర్మ(23)గా గుర్తించారు. శ్రీజ వర్మ (Sreeja Varma) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. శ్రీజ రాత్రి భోజనం చేసిన అనంతరం నివాసముండే అపార్ట్‌మెంట్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ వెనకాల నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందింది. ఈ మేరకు పోలీసులు న్యూయార్క్‌లోని ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Next Story






