- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో ప్రధాని మోడీ స్పెషల్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రాష్ట్ర ప్రజలకు స్పెషల్ విషెస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రాష్ట్ర ప్రజలకు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచడానికి NDA సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలు సంమృద్ధి మార్గంలో సాగాలి.. రాష్ట్రపతి ముర్ము
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ‘X’ వేదిక ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు..! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి యొక్క శక్తివంతమైన ఆధునిక పరిణామాన్ని కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి మరియు సమృద్ధి మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా’ అంటూ ప్రెసిడెంట్ ద్రౌపది తెలంగాణ ప్రజలకు విషెస్ చెప్పారు.






