తెలంగాణలో ఐపీఎస్ కేడర్ పెంపు.. 8 జిల్లాలకు కొత్త ఎస్పీ పదవులు!

by Phanindra |   (  Updated:2025-05-23 17:48:56  IST  )

తెలంగాణలో ఐపీఎస్ కేడర్ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కేడర్ రివ్యూ జరగడం గమనార్హం.

తెలంగాణలో ఐపీఎస్ కేడర్ పెంపు.. 8 జిల్లాలకు కొత్త ఎస్పీ పదవులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తెలంగాణ ఐపీఎస్ కేడర్‌ బలాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఐపీఎస్ కేడర్ సంఖ్యను 139 నుంచి 151కు పెంచుతూ గురువారం నాడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 76 నుంచి 83కు పెరిగింది. చివరగా 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు కేడర్ రివ్యూ జరిగింది.

ఈ క్రమంలోనే తాజా రివ్యూలో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిర్సిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కొత్త ఎస్పీ పోస్టులు దక్కాయి. అలాగే రాజకొండకు కమిషనర్ పదవి కూడా మంజూరైంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 112 ఐపీఎస్ పోస్టులుండేవి. వీటిని 2016లో 139కు పెంచగా.. ఇప్పుడు వీటిని 151కు పెంచారు.

Next Story