ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా.. తేజిందర్ సింగ్ నియామకం!

by Geesa Chandu |

భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా.. ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఆదివారం ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో బాధ్యతలు చేపట్టారు.

ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా.. తేజిందర్ సింగ్ నియామకం!
X

దిశ, వెబ్ డెస్క్: భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా.. ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఆదివారం ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తేజిందర్ సింగ్ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు.

ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో పూర్వ విద్యార్థి. ఆయన మొదటగా 1987 జూన్ 13 న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో నియామకమయ్యారు. కాగా ఆయన 4,500 కంటే ఎక్కువ విమానాలలో కేటగిరీ-A ఇన్ స్ట్రక్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఒక ఫైటర్ స్క్వాడ్రన్, రాడార్ స్టేషన్ లో ప్రధాన పోరాట స్థావరానికి నాయకత్వం వహించారు. దానితో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. అయితే ఈ నియామకానికంటే ముందు మేఘాలయాలోని షిల్లాంగ్ లో భారత వైమానిక దళం ప్రధాన కార్యాలయం అయిన తూర్పు ఎయిర్ కమాండ్ లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా పనిచేశారు. తేజిందర్ కు 2007 లో వాయు సేన పతకం, 2022 లో భారత రాష్ట్రపతిచే అతి విశిష్ట సేవా పతకం లభించాయి.

Next Story