- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tejaswi yadav: ‘ఇండియా’కు ఎవరు నాయకత్వం వహించినా ఓకే.. తేజస్వీ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ (Tmc) చీఫ్ మమతా బెనర్జీ (Mamath benarjee)తో సహా ఏ సీనియర్ నాయకుడు ఇండియా కూటమికి నాయకత్వం వహించినా తమకు అభ్యంతరం లేదని రాష్ట్రీయ జనతాదళ్(RjD) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) అన్నారు. అయితే ఏకాభిప్రాయం ద్వారా ఈ నిర్ణయం తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ‘నాయకత్వం విషయమై ఇండియా కూటమి ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. దీనిపై అన్ని భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరగాలి. మమతా బెనర్జీ నాయకత్వం వహించినా ఎటువంటి సమస్య లేదు. కానీ బీజేపీ వ్యతిరేక కూటమిలో చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి. నాయకుడిని ఎన్నుకోవడంలో కలిసి కూర్చుని సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కూటమిలో చాలా మిత్రపక్షాలు ఉన్నాయని, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో నాయకుడిని ఎన్నుకుంటాయన్నారు. కాగా, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తానని ఇటీవల మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై రాజకీయ గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌తో సహా ఎస్పీ నాయకులు మమతా బెనర్జీ ప్రకటనను సమర్థించారు. ఈ నేపథ్యంలోనే తేజస్వీ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.