Tejaswi yadav: బిహార్‌లో మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తాం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

by B.Srinivas |

బిహార్‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు.

Tejaswi yadav: బిహార్‌లో మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తాం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi yadav) తెలిపారు. ఈ అంశంపై ప్రజలు, ప్రభుత్వ అధికారులతో చర్చించి వారి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ‘ఒక ఇంజన్ అవినీతిలో నిమగ్నమై ఉంది. మరొకటి నేరాల్లో లీనమై ఉంది. నేరస్థులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నేరస్థులు విజయ్, సామ్రాట్‌లుగా మారారు’ అని ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘అంబులెన్స్‌లలో సామూహిక లైంగిక దాడులు జరుగుతున్నాయి, పట్టపగలు కాల్పులకు పాల్పడుతున్నారు. వారంలో అనేక హత్యలు జరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు’ అని ఆరోపించారు. కాగా, బిహార్‌లో మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సైతం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story