Tejaswi: ప్రతిపక్ష కూటమిలో గందరగోళమేమీ లేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

by B.Srinivas |

బిహార్‌లోని ప్రతిపక్ష కూటమిలో సీఎం అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొందనే వాదనలను తేజస్వీ యాదవ్ తోసిపుచ్చారు.

Tejaswi: ప్రతిపక్ష కూటమిలో గందరగోళమేమీ లేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌లోని ప్రతిపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌లో సీఎం అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొందనే వాదనలను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) తోసిపుచ్చారు. సీఎం క్యాండిడేట్ విషయంలో కన్వ్యూజన్ లేదని సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. బిహార్ అధికారయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. కటమిలో ఎటువంటి సందేహాలు లేవని తెలిపారు. బిహార్ ప్రజలే నిర్ణయాధికారులని, తదుపరి సీఎంను ఎన్నుకునేది వారేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ అలయెన్స్‌ను ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.

మా కూటమికి 225 సీట్లు వస్తాయి: చిరాగ్ పాశ్వాన్

సీట్ల పంపకంపై ఎన్డీఏలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chiraag paashwan) కొట్టిపారేశారు. రాష్ట్రంలోని 243 సీట్లలో ఎన్డీఏ కూటమి 225 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ బలహీనమైన వ్యక్తి కాదని ఆయనే కూటమికి బలమని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీ చేస్తారా అని ప్రశ్నించగా చర్చలు కొనసాగుతున్నాయని ఈ విషయం ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపారు. ఎల్జేపీ మాత్రం ఎన్నికల బరిలో ఉంటుందన్నారు. ప్రతిపక్ష కూటమిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని నొక్కి చెప్పారు.

Next Story