Tejaswi: ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న తేజస్వీ యాదవ్

by B.Srinivas |

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Tejaswi: ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికాగా ఆ టైంలో తేజస్వీ కారులో లేకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. బిహార్ (Bihar) లోని వైశాలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజస్వీ మాధెపురాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై పాట్నాకు తిరిగి వెళ్తుండగా గోరౌల్ సమీపంలోని పాట్నా-ముజఫర్‌పూర్ జాతీయ రహదారిపై టీ తాగడానికి తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కన ఆపాడు. తేజస్వీ కారు దిగి బయటకు రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు కాన్వాయ్ లోకి చొచ్చుకెళ్లింది. పలు వాహనాలను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలైనట్టు వైశాలి ఎస్పీ లలిత్ మోహన్ శర్మ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో తేజస్వీ 5 అడుగుల దూరంలో ఉండటం గమనార్హం. దీనిపై తేజస్వీ స్పందించారు. తనకు భద్రత కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ప్రమాదాలు జరగడం సహజమేనని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story