- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలపై వరాల జల్లు.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖాతాలోకి రూ.30వేలు
బీహార్ ఎన్నికల సందర్భంగా మహిళలపై పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఎన్నికల సందర్భంగా మహిళలపై పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి బిహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మై బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రాష్ట్రంలోని మహిళలు అందరి ఖాతాల్లో ఏడాదికి రూ.30వేలు జమ చేస్తామని చెప్పారు.
డిసెంబర్ 1 నుండి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేయగా, మహిళల కోరిక మేరకు ఒకేసారి సంక్రాంతి సందర్భంగా ఖాతాల్లో రూ.30వేలు వేస్తామని మరో ప్రకటన చేశారు. మరోవైపు రాష్ట్రంలోని రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు వరికి రూ.300, గోదుమలకు బోనస్ రూ.400 చెల్లిస్తామన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు 70కి.మీల పరిధిలోనే ఉద్యోగ నియామకాలు కల్పిస్తామని చెప్పారు.






