- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tejashwi Yadav: ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే
ఢిల్లీలో కొత్తగా ఎన్నికలు జరపాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

Tejashwi Yadav demands fresh election in Delhi
దిశ, వెబ్ డెస్క్: ఆర్జేడీ ( Rashtriya Janata Dal) నాయకులు తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ బృందానికి క్లీన్ చీట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొత్తగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్. బీజేపీ కుట్రలు పన్ని అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిందని... తప్పుడు కేసులు బనాయించి ఇరికించిందని ఫైర్ అయ్యారు. కోర్టు ముందు బీజేపీ వేసిన కేసులు నిలువలేకపోయాయని చురకలు అంటించారు.
ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు తేజస్వి యాదవ్. ఈ తప్పుడు కేసు కారణంగా 2025లో ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని వెల్లడించారు. ఇక ఈ కేసు తేలిపోయిందని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. మరోసారి ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతాడు అని కూడా స్పష్టం చేశారు. అందుకే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేయాలన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఊరట
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. మద్యం పాలసీ కేసు నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను, మనీష్ సిసోడియాను డిశ్చార్జ్ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించారని పేర్కొంది కోర్టు. చార్జిషీటులో లోపాలు ఉన్నాయని సీబీఐని మందలించారు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి. ఈ కేసులో నిందితులపై అభియోగాలు మోపడం సరికాదని వెల్లడించింది. వారిని కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ జస్టిస్ జితేందర్ సింగ్( Jithendar Singh) ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
లిక్కర్ కేసు నుండి తనను డిశ్చార్జ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం మీడియా ముందు భావోద్వేగానికి లోనైయ్యారు అరవింద్ కేజ్రీవాల్. మనీష్ సిసోడియాను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. చట్టం ముందు న్యాయం గెలిచిందని ప్రకటించారు. తప్పుడు కేసును తమపై మోపిందని బీజేపీ అగ్ర నాయకత్వం అంటూ ఫైర్ అయ్యారు. ఈ కేసులు వేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసే కుట్రలకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేశారని ఆగ్రహించారు. కానీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తమకు న్యాయం చేసిందన్నారు.






