- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓట్లు.. తప్పు ఈసీదా? ఆయనదా?
బిహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓట్లు.. తప్పు ఈసీదా? ఆయనదా? అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నిలదీశారు. ఎస్ఐఆర్ తర్వాతే ఇది జరిగిందన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటర్ కార్డులున్నాయని చెప్పిన తేజస్వి యాదవ్.. లఖిసరాయ్ నియోజకవర్గంతోపాటు బంకిపూర్ ఓటర్ జాబితాలో కూడా విజయ్ కుమార్ పేరుందని ఆరోపించారు. ఈ రెండు చోట్ల వేర్వేరు ఓటర్ కార్డు నెంబర్లతోపాటు ఆయన వయసు కూడా వేర్వేరుగా ఉందని తేజస్వి చెప్పారు. ఎస్ఐఆర్ తర్వాతనే ఇది జరిగిందని, ఈ తప్పిదానికి బాధ్యులెవరని నిలదీశారు.
Next Story






