Astra missile: తేజస్ ఫైటర్ జెట్ మిస్సైల్ దూసుకెళ్లింది.. ఆస్ట్రా క్షిపణి టెస్ట్ సక్సెస్

by Ramesh Naini |   (  Updated:2025-03-13 05:44:21  IST  )

దేశీయంగా రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ ఫైటర్ జెట్ విమానాల (LCA) AF MK1 ఆస్ట్రా మిస్సైల్ టెస్ట్ సక్సెస్ అయింది.

Astra missile: తేజస్ ఫైటర్ జెట్ మిస్సైల్ దూసుకెళ్లింది.. ఆస్ట్రా క్షిపణి టెస్ట్ సక్సెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయంగా రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ ఫైటర్ జెట్ విమానాల (LCA) AF MK1 ఆస్ట్రా మిస్సైల్ టెస్ట్ సక్సెస్ అయింది. బుధవారం ఒడిశాలోని చండిపూర్ తీరంలో మిస్సైల్ టెస్ట్ విజయవంతం అయినట్లు తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (Tejas fighter jet) ఫైటర్ జెట్ మిస్సైల్ (air-to-air) ఎయిర్-టు-ఎయిర్ నేరుగా టార్గెట్‌ను ఢీకొట్టి, ప్రభావాన్ని చూపించిందని, ఈ ప్రయోగం గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొంది. క్షిపణిలో నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయని, ఈ మిస్సైల్ దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను టార్గెట్ చేయగలదని వెల్లడించింది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఈ టెస్టును నిర్వహించింది. (ASTRA missile)ఆస్ట్రా క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)రూపొందించింది. క్షిపణిని ఇప్పటికే భారత వైమానిక దళంలో చేర్చినట్లు రక్షణ శాఖ తెలిపింది.

Read More..

North American X-15: 12 నిమిషాల్లో 1,148 కిలోమీటర్ల ప్రయాణం.. ఈ విమానం మామూలు స్పీడ్‌ కాదు.. !

Next Story