- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేజస్ ప్రమాదం... ఈ విన్యాసమే కారణం!
శుక్రవారం దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో విన్యాసాలు చేస్తుండగా.. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలి, పైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో విన్యాసాలు చేస్తుండగా.. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలి, పైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏవియేషన్ రంగ నిపుణులు ప్రమాదానికి చెందిన వీడియోలను వీక్షించి, ఘటనకు గల కారణాలపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. తేజస్ విమానం నేలను ఢీకొట్టడానికి ముందు 'నెగెటివ్ G టర్న్' విన్యాసం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
'నెగెటివ్ G' అంటే సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై పనిచేసే బలాలు. విన్యాసాలు చేసేటప్పుడు లేదా అకస్మాత్తుగా కిందకి దిగేటప్పుడు 'నెగెటివ్ G' ఉంటుంది. దీనివల్ల పైలట్ మీద.. సీటు నుంచి పైకి నెట్టివేసే బలం పనిచేస్తుంది. ఈ బలాలను సరిగ్గా నియంత్రించలేకపోతే పైలట్‌కు రక్త ప్రసరణ తల వైపు ఎక్కువగా చేరి స్పృహ కోల్పోవడం సంభవిస్తుంది.
తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా రూపొందించడం వల్ల దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉండి తీవ్రమైన 'నెగెటివ్ G' అనేది విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోయే చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అత్యాధునిక ఫ్లై-బై-వైర్ వ్యవస్థను తేజస్ లో అమర్చినప్పటికీ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా భారత్ లో మిగ్-21 విమానాలను తొలగించిన తరువాత తేజస్‌ను IAF తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా భావిస్తోంది.






