- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఫా వైరస్‌తో టీనేజర్ మృతి.. మూడు జిల్లాల్లో హై అలర్ట్
ప్రమాదకర నిఫా వైరస్ ఓ టీనేజర్ ప్రాణాలు బలి తీసుకుంది. కేరళలోని మలప్పురంకు చెందిన 18 ఏళ్ల బాలిక ప్రమాదకర వైరస్ బారినపడి జూలై 1వ తేదీన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయింది.

- కేరళలో మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రమాదకర నిఫా వైరస్ ఓ టీనేజర్ ప్రాణాలు బలి తీసుకుంది. కేరళలోని మలప్పురంకు చెందిన 18 ఏళ్ల బాలిక ప్రమాదకర వైరస్ బారినపడి జూలై 1వ తేదీన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయింది. పాలక్కాడ్ కు చెందిన మరో 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అయితే వీరిద్దరి శాంపిల్స్ ని సేకరించిన వైద్యులు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా రెండు కూడా నిఫా వైరస్ పాజిటివ్ గా వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ వెంటనే కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ చదువుతున్న టీనేజీ బాలిక కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులతో బాధపడుతోంది. ఆమెను కొట్టక్కల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొని రాగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు గుర్తించారు. ఆమెకు ట్రీట్మెంట్ చేసిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని వెంటనే క్వారంటైన్ చేశారు.
అసలేంటి ఈ నిఫా వైరస్
నిఫా వైరస్ ఒక వైరల్ వ్యాధి. ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ప్రధానంగా గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నిఫా వైరస్ మానవులలో తీవ్రమైన ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని కలిగిస్తుంది.
నిఫా వైరస్ లక్షణాలు
- జ్వరం
- తలనొప్పి
- మయాల్జియా (కండరాల నొప్పి)
- వాంతులు
- తీవ్రమైన సందర్భాలలో, మెదడు వాపు లేదా తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు
నిఫా వైరస్ కి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మరి గానే వ్యవహరిస్తోంది.






