Tedros: యూఎస్ పునరాలోచించాలి.. ట్రంప్ నిర్ణయంపై డబ్లూహెచ్ఓ స్పందన

by B.Srinivas |

డబ్లూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు.

Tedros: యూఎస్ పునరాలోచించాలి.. ట్రంప్ నిర్ణయంపై డబ్లూహెచ్ఓ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా (America) వైదొలగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ (Trump) చేసిన ప్రకటనపై డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) స్పందించారు. యూఎస్ దీనిపై పునరాలోచన చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘డబ్లూహెచ్ఓ నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం పట్ల డబ్లూహెచ్ఓ విచారం వ్యక్తం చేస్తోంది. అమెరికన్లతో సహా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో డబ్లూహెచ్ఓ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యాధి మూల కారణాలను పరిష్కరించడం, బలమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం, వ్యాధి వ్యాప్తితో సహా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను గుర్తించి నియంత్రించడం డబ్లూహెచ్ ఓ లక్ష్యం.కాబట్టి యూఎస్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.1948లో అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక సభ్యుడిగా ఉందని, అప్పటి నుంచి 193 ఇతర సభ్య దేశాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థను బలేపేతమైందని చెప్పారు.

డబ్లూహెచ్ఓకు మద్దతుగా ఉంటాం: చైనా

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా వెల్లడించిన తర్వాత చైనా (China) కీలక ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతుగా ఉంటామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ చైనా తన బాధ్యతలను నెరవేరుస్తుందని, డబ్లూహెచ్ఓకు సహకరిస్తూనే ఉంటామని తెలిపారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. డబ్లూహెచ్ఓను బలహీన పర్చకూడదని దానికి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Next Story