AMSS వ్యవస్థలో సాంకేతిక లోపం.. ఢిల్లీ వైమానిక సేవల్లో తీవ్ర అంతరాయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-07 04:41:16  IST  )

AMSS వ్యవస్థలో సాంకేతిక లోపం.. ఢిల్లీ వైమానిక సేవల్లో తీవ్ర అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) పరిధిలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines)తో పాటు అన్ని విమాన సర్వీసులలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ మేనేజ్‌మెంట్ అండ్ షెడ్యూలింగ్ సిస్టమ్ (Aviation Management and Scheduling System) తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా 100కు పైగా విమాన రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో సిస్టమ్ స్లోడౌన్, చెక్‌ ఇన్ ప్రక్రియలు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే ప్యాసింజర్లకు అన్ని విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి. ఫ్లైట్ సర్వీసెస్ రియల్ టైమ్ అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story